Amit Shah Reached Hyderabad Attend Telangana Liberation Day Tomorrow :హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, విజయశాంతి, ధర్మపురి అర్వింద్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బ్యాండ్మిటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో సింధు తండ్రి పీవీ రమణ కూడా పాల్గొన్నారు.
అనంతరం జూబ్లీహిల్స్‌లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీశారు.
Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం
రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. ఈ మధ్యలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల తదితర నాయకులతో.. అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం.. కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తుండటం.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు వంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.