Amit Shah Khammam Tour Schedule :కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్లో 2 గంటల 10 నిమిషాలకు కొత్తగూడెం చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
Amit Shah: 'రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం'
Amit Shah Telangana Tour Schedule : 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు గంట పాటు బహిరంగ సభలో పాల్గొని బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. సభ అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో గంటపాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు. దీంతో పాటు ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.45 గంలకు హెలికాప్టర్లో బయలుదేరి..గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 6.20 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Rythu Gosa BJP Bharosa Meeting in Khammam : రాష్ట్రంలో రైతుల సమస్యలకు, కౌలు రైతుల కన్నీటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని.. బీజేపీ అధికారంలోకి వస్తే అన్నదాతల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం బీజేపీ చేసే విషయాలను తెలిపేందుకు ఆగస్టు 27న ఖమ్మం జిల్లాలో రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.