Amit Shah Fires on KCR Government : తెలంగాణలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పగా చెప్పిన కేసీఆర్ సర్కార్.. వాటిని పూర్తి చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసి కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఔటర్ రింగ్‌రోడ్డు లీజు వేలంలోనూ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Amit Shah Election Campaign in Hyderabad :రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారని.. అదీ జరగలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించటం లేదన్న ఆయన.. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దుచేస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం
Telangana Assembly Elections 2023 : బీజేపీ అధికారంలోకి రాగానే.. వరికి క్వింటాల్‌కు రూ.3100 చెల్లిస్తామని అమిత్ షా తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ తగ్గించలేదని.. తాము అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఆడపిల్లల పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని వివరించారు. ఈ క్రమంలోనే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ 2014లో అన్నారని గుర్తు చేసిన కేంద్రమంత్రి.. ఇప్పటికీ ఆ హామీ అలాగే మిగిలి పోయిందని ఎద్దేవా చేశారు.