తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాలానగర్​లో ముగ్గురు అమెరికన్లు.. 14రోజులు ఇంట్లోనే ఉండాలని ఆదేశం'

హైదరాబాద్​ బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నవజీవన్​నగర్​లో నివాసముండే ఓ వ్యక్తి ఇంటికి అమెరికా నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Americans at balanagar in Hyderabad
'అమెరికా నుంచి వచ్చారని పోలీసులకు సమాచారం ఇచ్చారు'

By

Published : Mar 21, 2020, 12:26 PM IST

హైదరాబాద్​ బాలానగర్​కు ముగ్గురు విదేశీయులు వచ్చారు. నవజీవన్​నగర్​లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఇంటికి అమెరికా నుంచి ముగ్గురు వ్యక్తులు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్పందించిన బాలానగర్​ సీఐ వాహేదుద్దీన్​ వారిని అదే ఇంట్లో ఉంచి జీహెచ్​ఎంసీ అధికారులు, వైద్య సిబ్బందిని రప్పించారు. విదేశీయులతో పాటు ఇంట్లో ఉన్న వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, కుటుంబ సభ్యులందరిని 14 రోజుల పాటు ఇంట్లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.

'అమెరికా నుంచి వచ్చారని పోలీసులకు సమాచారం ఇచ్చారు'

ABOUT THE AUTHOR

...view details