తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​కు అమెరికా తెలుగు సంఘం సాయం

కరోనా రెండో దశతో అతలాకుతలమవుతున్న భారత్​ను ఆదుకునేందుకు అమెరికా తెలుగు సంఘం ముందుకు వచ్చింది. ఆక్సిజన్​ కొరత తీర్చేందుకు కాన్సంట్రేటర్లను అమెరికా నుంచి ఇండియాకు పంపించింది.

By

Published : May 17, 2021, 6:12 PM IST

American Telugu Association help to India
American Telugu Association help to India

కరోనా రెండో దశతో అతలాకుతలమవుతున్న భారత్​ను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తెలుగు సంఘం కరోనా పోరాటంలో భారత్​కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం అమెరికా తెలుగు సంఘం కొవిడ్​ డిజాస్టర్​ హెల్ప్​ సర్వీసెస్​ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తోంది.

రెండోదశలో కరోనా బాధితులు... ఆక్సిజన్​ స్థాయిలు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్సిజన్​ కొరత తీర్చేందుకు కాన్సంట్రేటర్లను అమెరికా నుంచి ఇండియాకు పంపించింది. ఈ సందర్భంగా అమెరికా తెలుగు సంఘం ఇండియా ప్రతినిధులుగా ఉన్న లోహిత్​కుమార్​, శ్రీనివాస్​ బండారు, కృష్ణరెడ్డి తదితరులు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీటిని జిల్లా కలెక్టర్ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులకు అందజేస్తామని వెల్లడించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వల్ల కానీ... ఒకరి ప్రాణాలైన కాపాడితే అదే చాలు అంటున్నారు.

ఇదీ చదవండి:రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ABOUT THE AUTHOR

...view details