మలక్‌పేట పాఠశాలలో అమెరికా టీచర్ల సందడి - nehru memorial school
మలక్‌పేటలోని ప్రభుత్వ నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలో బోధనా విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర, అమెరికా ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యా బోధనలపై టీచర్స్ ఐడియా ఎక్స్‌చేంజ్ కార్యక్రమంలో భాగంగా కార్యశాల ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశలలో విద్యా బోధనపై టీచర్స్ ఐడియా ఎక్స్‌చేంజ్ కార్యక్రమం నిర్వహించారు. అమెరికాకు చెందిన జాక్వెలిన్ థరా స్టాన్, టీన్ అనే ఉపాధ్యాయులు వారిదేశంలో అమలవుతున్న బోధన విధానాలపై ఇక్కడి విద్యార్థులకు వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు చిత్రలేఖనం, రంగోళి, యోగా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భవిత కేంద్రాలలో బుద్ధి మాంద్యం కలిగిన చిన్నారులకు చదువు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇరుదేశాల విద్యార్థులతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టులు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయినులు విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.