మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్సుల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. శనివారం మరో 21 అంబులెన్సులను ప్రగతి భవన్లో కేటీఆర్ ప్రారంభించారు.
మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మూడు చొప్పున, మంత్రి నిరంజన్ రెడ్డి ఒకటి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వరంగల్‌కు చెందిన లక్ష్మణరావు ఒక్కో అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు.