తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఏకాంతంగానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించిన తితిదే... నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య నిర్వహిస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి... బ్రహ్మోత్సవాల్లో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు, నిర్వహణ ఇబ్బందులపై అధికారులతో కూలంకషంగా చర్చించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం - తిరుమల శ్రీవారి వార్తలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలోపలే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణపై రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. ఈ అంశంపై ఈవో జవహర్ రెడ్డి.. సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలో నిర్వహించేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
కొవిడ్ తీవ్రత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.... ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు మొగ్గుచూపారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ దీనిపై స్పష్టతనివ్వనున్నారు.
ఇదీ చదవండి
ధరణి యాప్ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్
TAGGED:
తిరుమల శ్రీవారి వార్తలు