'అందరూ అంబేడ్కర్ మార్గంలో నడవాలి' - AMBEDKER BIRTH ANNIVERSARY CELEBRATION
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'అందరూ అంబేడ్కర్ మార్గంలో నడవాలి'
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వేడుకలు నిర్వహించారు. కళాశాల ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. జయంతి వేడుకల్లోనే కాకుండా ఎప్పుడూ అంబేడ్కర్ని స్మరించుకోవాలని సూచించారు.