తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించిన జీహెచ్​ఎంసీ - areest

హైదరాబాద్​ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్​ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారు జామున అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేదంటు... జీహెచ్​ఎంసీ అధికారులు విగ్రహాన్ని తొలగించారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించిన జీహెఎంచ్​సీ సిబ్బంది

By

Published : Apr 13, 2019, 10:37 AM IST

Updated : Apr 13, 2019, 3:34 PM IST

హైదరాబాద్‌ పంజాగుట్ట చౌరస్తాలో జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు ఏసీపీ తిరుపతన్న. అంబేడ్కర్‌ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తెల్లవారు జామున ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని తొలగిస్తుండగా కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. జీహెచ్​ఎంసీ అధికారుల ఫిర్యాదుతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విగ్రహాన్ని తొలగించారు. అడ్డుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించిన జీహెఎంచ్​సీ సిబ్బంది
Last Updated : Apr 13, 2019, 3:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details