అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పెంచినట్లు యూనివర్సిటీ ఇంఛార్జి రిజిస్ట్రార్ జి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఈనెల 22వరకు గడువు ఉందని వెల్లడించారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈనెల 22 వరకు పొడిగించారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అర్హులు ఈనెల 22 వరకు చేరవచ్చునని యూనివర్సిటీ ఇంఛార్జి రిజిస్ట్రార్ లక్ష్మారెడ్డి తెలిపారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారితో పాటు... 2016 నుంచి 2019 వరకు యూనివర్సిటీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు నేరుగా డిగ్రీలో చేరవచ్చునన్నారు. ఇప్పటికే ప్రవేశం పొందినప్పటికీ.. బోధన రుసుము చెల్లించలేక పోయిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ వెబ్ సైట్, ఫోన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ