ట్రాఫిక్ నియమాలు పాటించే వారిని ప్రోత్సహించేలా అంబర్‌పేట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ వాహనాలకు ఎలాంటి చలానా లేకుండా... ట్రాఫిక్ నియమాలు సక్రమంగా పాటించే వారికి ఓ గులాబీ పువ్వుతో పాటు పీవీఆర్ మల్టీప్లెక్స్ సినిమా టికెట్‌ను బహుమతిగా అందజేశారు. ట్రాఫిక్ డీసీపీ కె.బాబూరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నియమాలు పాటించండి