Amaravati Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 38వ రోజుకు చేరింది. చిత్తూరు జిల్లా చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఊరందూరు మీదుగా శ్రీకాళహస్తికి చేరుకోనుంది. రాత్రికి శ్రీకాళహస్తిలోనే రైతులు బస చేయనున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలో రాజధాని రైతుల బసకు వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారు.
బస చేసేందుకు ఓ కల్యాణమండపాన్ని రైతులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానిక వైకాపా నేతల ఒత్తిడితో కల్యాణమండపం నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫలితంగా అన్నదాతలు వేరే ప్రాంతంలో బస ఏర్పాటు చేసుకుంటున్నారు. చింతలపాలెం వద్ద మహిళా రైతులకు అపూర్వ స్వాగతం లభించింది. శ్రీకాళహస్తి వాసులు మహిళా రైతులకు సారె పెట్టి గౌరవించారు. పసువు, కుంకుమ ఇచ్చి శాలువాతో సత్కరించారు.
నాకు కాలు బెణికినా.. రైతులను చూస్తుంటే నాది పెద్ద దెబ్బ కాదు అనిపిస్తోంది. పసికందును 3 ముక్కలు చేసినట్లుగా రాజధానిని విడదీసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ ఖాయం. సభకు నాతోపాటు డి.రాజా, ఇతర ముఖ్యనేతలు వస్తారు.