తెలంగాణ

telangana

ETV Bharat / state

Amaravati JAC: 'అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు'

ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం(amaravathi farmers on ysrcp repeal 3 capital act) తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు స్పందించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

Amaravati JAC
Amaravati JAC

By

Published : Nov 22, 2021, 1:48 PM IST

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి(Amaravathi jac on 3 capitals withdraws) ఐకాస ప్రకటించింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఐకాస నేతలు.. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఐకాస నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతిని(ap 3 capitals withdraws) ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటన వచ్చిన తర్వాతే ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముతామని రైతులు స్పష్టం చేశారు.

ఇప్పటికే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్​ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు కోర్టుకు చెప్పారు. త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వివరాలు అందజేశారు. ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది.

మూడు రాజధానుల చట్టాన్ని(AP three capitals act withdrawn) ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్న ఏపీ రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details