తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష

ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసన దీక్షలు పండుగ రోజూ కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

amaravati-farmers-protest-reached-393-day-at-guntur-district in andhra pradesh
పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష

By

Published : Jan 13, 2021, 8:39 PM IST

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి పరిధిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు పండుగపూట కూడా కొనసాగించారు. బుధవారంతో ఈ నిరసనలు 393వ రోజుకు చేరాయి. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఉద్ధండరాయునిపాలెంలో పళ్లు, ఫలహారాలతో మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గోదాదేవి రంగనాథ స్వామి వారి కల్యాణం చేశారు.

ఇదీ చదవండి:ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు

ABOUT THE AUTHOR

...view details