ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నేపథ్యంలో అమరావతి రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఏపీ శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు అమరావతి ఉద్యమ జెండా చూపిస్తూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చిన తమను ఆదుకోవాలంటూ రైతులు నిరసన తెలిపారు.
మందడం శిబిరం వద్ద రైతుల ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మందడంలో దీక్షా శిబిరం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్తుండగా.. రైతులు, మహిళలు శిబిరం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.
మందడం శిబిరం వద్ద రైతుల ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు
రైతులు, మహిళలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేయగా.. వారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఉత్తర్ప్రదేశ్లో జర్నలిస్ట్ సజీవదహనం