తెలంగాణ

telangana

ETV Bharat / state

289వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన - అమరావతి రైతుల నిరసన తాజా వార్తలు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే వరకు వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని రైతులు తేల్చిచెప్పారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన ప్రస్తుతం 289వ రోజుకు చేరుకుంది.

289వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన
289వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన

By

Published : Oct 1, 2020, 10:20 PM IST

ఏపీ అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 289వ రోజుకు చేరుకుంది. తుళ్లారు, వెలగపూడి, మందడం, ఐనవోలు, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, నేలపాడు, గ్రామాల్లో రైతులు ఆందోళను కొనసాగించారు. నెక్కల్లులో గురువారం నుంచి దీక్షను ప్రారంభించారు. ప్రజాగాయకులు రమణ.. చిన్నారులతో కలసి ఉద్యమ గీతాలు పాడారు.

మందడంలో సాయి కీర్తన చేస్తూ అక్కడి రైతులు నిరసన తెలిపారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ ప్రార్థనలు చేశారు. కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చెందిన తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు ఉద్యమానికి సంఘీభావంగా తమ ప్రాంతంలోనూ ఐకాస ఏర్పాటు చేశామని నేతలు చెప్పారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

ABOUT THE AUTHOR

...view details