Farmer Gift to Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై అమరావతి ప్రాంత రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 23వ తేదీన లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వరి పంట వేశారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన పులి మరియదాసు అలియాస్ చిన్నా రాజధాని ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్నారు.
ఏపీలో రైతు అభిమానం.. నారా లోకేశ్ పచ్చని కానుక - గుంటూరు లేటెస్ట్ న్యూస్
Variety Celebration for Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌పై ఏపీలోని అమరావతి ప్రాంత రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖాకృతిలో వరి పంట పండించి బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. త్వరలో ఆయన చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని పచ్చని పంట ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Variety Celebration for Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామ పరిధిలో ఎకరా పొలం కౌలుకు తీసుకున్నారు. అందులో 70 సెంట్లలో లోకేశ్ ముఖాకృతిలో వరి పండించారు. ఆదివారం పంటను కోసి ధాన్యాన్ని లోకేశ్‌కు పుట్టినరోజు కానుకగా ఇవ్వనున్నారు. లోకేశ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని తన పచ్చని పంట ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పులి చిన్నా వివరించారు.
ఇవీ చదవండి: