ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఐకాస నేతలు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. ఈనెల 17 నాటికి రైతులు చేపట్టిన ఉద్యమం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పడవల రేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో రైతులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'
ఏపీలోని విజయవాడలో ఐకాస నేతల మహా పాదయాత్ర ముగిసింది. పడవల రేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వరకు ర్యాలీ సాగింది. ఈనెల 17న నిర్వహించే బహిరంగ సభకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రావాలని అమరావతి పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది.
'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో పాదయాత్ర దాదాపు 5 కిలోమీటర్ల మేర సాగింది. మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఇదే తరహా కార్యక్రమాలు ఇకపై రాష్ట్రమంతా నిర్వహిస్తామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. ఈనెల 17న ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించే బహిరంగ సభకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొనాలని అమరావతి పరిరక్షణ సమితి నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:మత్స్యావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య