తెలంగాణ

telangana

ETV Bharat / state

Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం - ఏపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని రైతులు, మహిళలు మూడో రోజూ కదం తొక్కారు. ఈ రోజు గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహా పాదయాత్ర.. నవంబర్​ 1న తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

Maha padayatra 3rd day
మహాపాదయాత్ర

By

Published : Nov 3, 2021, 11:53 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నేడు రైతులు, మహిళలు 10.8 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ గుంటూరు నగరంలో రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి పాదయాత్ర పుల్లడిగుంట చేరుకోనుంది. గుంటూరు నగరవాసులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తెదేపా నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్‌ పాదయాత్రలో పాల్గొన్నారు.

అలా ప్రారంభమైంది..

'న్యాయస్థానం నుంచి దేవస్థానం ’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహా పాదయాత్ర.. నవంబర్​ 1న తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ లాంగ్‌ మార్చ్‌కి దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. పాదయాత్రకు వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం రైతులు పోరాటం చేస్తున్నారు. 45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న.. తిరుపతికి చెరేలా రూపొందించారు. డిసెంబర్​ 17న తిరుపతిలో జరిగే సభతో మహా పాదయాత్ర ముగియనుంది.

ఇదీ చదవండి:Cyber Crime: సరికొత్తగా.. ఓటీపీ చెప్పకుండానే రూ.19లక్షలు మాయం

ABOUT THE AUTHOR

...view details