తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగని అమరావతి రైతుల నిరసన.. 429వ రోజుకు చేరిన ఆందోళనలు - amaravathi farmers on privatization of steel plant

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్​ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ అమరావతిలో పలు గ్రామాల్లో మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు.

ఆగని అమరావతి రైతుల నిరసన.. 429వ రోజుకు చేరిన ఆందోళనలు
ఆగని అమరావతి రైతుల నిరసన.. 429వ రోజుకు చేరిన ఆందోళనలు

By

Published : Feb 18, 2021, 4:50 PM IST

ఏపీలోని అమరావతిలో రైతులు, మహిళల ఆందోళనలు 429వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని రైతులు, మహిళలు దీక్షా శిబిరాల్లో నిరాహార దీక్ష చేపట్టారు. తుళ్లూరు, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో మహిళలు నిరాహార దీక్షలు కొనసాగించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృష్ణాయపాలెం, తుళ్లూరులో మహిళలు నిరసన చేపట్టారు. గోరుతో తలంబ్రాల బియ్యాన్ని ఒలిచారు. మార్చి 11న జరిగే శివకల్యాణంలో ఈ తలంబ్రాలను వినియోగించి.. అమరావతే రాజధానిగా కొనసాగించాలని మొక్కులు చెల్లిస్తామని మహిళలు తెలిపారు.

ఆగని అమరావతి రైతుల నిరసన.. 429వ రోజుకు చేరిన ఆందోళనలు

ఇదీ చదవండి:కేశవాపురం జలాశయ నిర్మాణానికి తుదిదశ అటవీ అనుమతులు

ABOUT THE AUTHOR

...view details