అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఏపీ పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 379వ రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.
మందడం, వెలగపూడి, తుళ్లూరు, వెంకటపాలెంలోని దీక్షా శిబిరాలలో రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం అమరావతిలో లక్షకోట్ల సంపద సృష్టించిందని.. వాటితో ఏపీని అభివృద్ధి చేయవచ్చని చలసాని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఏపీకి అన్యాయం చేస్తోందని ఆరోపించారు.