తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం వెళ్తుండగా.. రైతుల 'జై అమరావతి' నినాదాలు - amaravathi farmers issue updates

ఏపీలోని అమరావతిలో రైతుల రాజధాని పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్.. సచివాలయానికి వెళ్తుండగా మందడం శిబిరం ఎదుట నిల్చుని రైతులు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం కాన్వాయ్ వైపు రైతులు వెళ్లకుండా పోలీసులు అడ్గుకున్నారు.

amaravathi
అమరావతి

By

Published : Feb 4, 2021, 2:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ వాహన శ్రేణి సచివాలయానికి వెళ్తున్న సమయంలో మందడం రైతులు 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. రైతులు సీఎం కాన్వాయ్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు.

తాము దీక్షా శిబిరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని రైతులు ఆరోపించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి:మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details