వరద బాధితులకు సాయం అందించకుండా తెరాస నాయకులే డబ్బులను పంచుకున్నారని కాంగ్రెస్ ఆల్విన్‌కాలనీ డివిజన్ అభ్యర్థి మారేళ్ల శ్రీనివాస్‌రావు అన్నారు. జీహెచ్ఎంసీలో ఆరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఆరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మారేళ్ల శ్రీనివాసరావు - గ్రేటర్ ఎన్నికలు 2020
ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆల్విన్ కాలనీ డివిజన్ అభ్యర్థి మారేళ్ల శ్రీనివాస్‌రావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఆరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మారేళ్ల శ్రీనివాసరావు
డివిజన్లోని ఎల్లమ్మబండ బస్తీలో ప్రధానంగా డ్రైనేజీ, రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసముంటున్న ప్రజలకు ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. కరోనా కాలంలో రేషన్ కార్డులు లేని ఎలాంటి సాయం అందించలేదని...ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.