తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు పేట్ బషీర్‌బాగ్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. హైదరాబాద్ అల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్లో ఇన్స్పెక్టర్ పులి యాదగిరి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అల్వాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తలసేమియా వ్యాధి గ్రస్తులకు అల్వాల్ పోలీసుల రక్తదానం
తలసేమియా వ్యాధి గ్రస్తులకు చేయూతగా హైదరాబాద్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.
తలసేమియా వ్యాధి గ్రస్తులకు అల్వాల్ పోలీసుల రక్తదానం
మానవతా దృక్పథంతో తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తాన్ని అందించాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీసులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభ పరిణామమని దాతలకు ఏసీపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు