2021 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ 29,271 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవని.. ఈ సంవత్సరం 12వేల 668 ట్రాక్టర్లు అందించినట్లు మంత్రి సభలో పేర్కొన్నారు. పంచాయితీల అభివృద్ధికి ప్రభుత్వం నెలనెల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు గ్రామ పంచాయితీలకు రూ.5వేల 761 కోట్లను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
బడ్జెట్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
రాష్ట్ర వార్షిక పద్దును శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించారు.
బడ్జెట్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్ల మేర కోత విధించినట్లు స్పష్టం చేశారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు రూ.500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో జిల్లా పరిషత్తులకు రూ.252 కోట్లు, మండల పరిషత్తులకు రూ.248 కోట్లను అందించనున్నట్లు వివరించారు.