రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన సుమారు 337 మంది పాత్రికేయులకు రూ.59.30 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన 256 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున, హోం క్వారంటైన్లో ఉన్న 81 మందికి రూ.10 వేల చొప్పున సాయం అందించినట్లు వివరించారు.
కొవిడ్ బారినపడిన పాత్రికేయులు వివరాలు పంపండి: అల్లం నారాయణ - రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తాజా వార్తలు
రాష్ట్రంలో కొవిడ్ బారినపడిన జర్నలిస్టులు తమ వివరాలను తన వాట్సాప్ నంబర్‌కు పంపాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఇప్పటి వరకు వైరస్ కోరల్లో చిక్కుకున్న సుమారు 337 మంది పాత్రికేయులకు అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
సోమవారం తాజాగా వివిధ జిల్లాలకు చెందిన పలువురు పాత్రికేయులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 72 మందికి పాజిటివ్ వచ్చిందని.. మరో నలుగురిని హోం క్వారంటైన్లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని నారాయణ పేర్కొన్నారు. ఈ 76 మందికి రూ.14.80 లక్షల ఆర్థిక సాయాన్ని వారి అకౌంట్లలో జమచేసినట్లు తెలిపారు. వైరస్ బారినపడిన జర్నలిస్టులు తమ వివరాలను తన వాట్సాప్ నంబర్ 8096677444 కు పంపాలని.. ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు.