ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. అందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బంద్ విజయవంతమైందని... అఖిలపక్ష నాయకులతో చర్చించి ఏపీ సీఎం జగన్ నిర్మాణాత్మక పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోరారు.