తెలంగాణ

telangana

ETV Bharat / state

కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరినీ.. పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి సంవత్సరంలో ఫెయిలైనవారికి... కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలను రద్దు చేయాలని సీఎం నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు.

All the second year students who have passed in telangana
ద్వితీయ సంవత్సరం ఫెయిలైన వారంతా పాస్​

By

Published : Jul 9, 2020, 9:25 PM IST

ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారంతా పాస్​

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్​కు​ సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరికీ... గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని నిర్ణయించింది.

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో.. ద్వితీయ సంవత్సరంలో లక్షా 47 వేల మంది... మొదటి సంవత్సరంలో సుమారు లక్షన్నర మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేక పోయారు. ఫెయిలైన వారికోసం నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు... కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు.

పదిరోజుల్లో ఫలితాలు...

గ్రేస్ మార్కులతో ఉత్తీర్ణులైనవారు.. కంపార్ట్‌మెంటల్‌లో ఉతీర్ణులైనట్లుగా పరిగణిస్తామని వివరించారు. మార్కుల మెమోలను ఈ నెల 31 తర్వాత... సంబంధిత కళాశాలల్లో పొందవచ్చన్న మంత్రి... రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను ..10 రోజుల తర్వాత వెల్లడిస్తామన్నారు.

ఆ తర్వాత సప్లిమెంటరీ...

ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత... సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులై... మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్ ఉన్నట్లయితే వారిని కూడా ఉత్తీర్ణులు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details