తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి(TRS President Election 2021 NEWS) ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 24వ తేదీ తుది గడువు. 25న హెచ్‌ఐసీసీలో(HICC NEWS) జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అదేరోజు ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ విభాగాల తరఫున విడివిడిగా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్(TELANGANA CM KCR NEWS) పేరును ప్రతిపాదించి బలపరుస్తూ నామినేషన్లు వేయనున్నారు.
కేసీఆర్ దిశానిర్దేశం!
నేడు పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్షాల సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హాజరై సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీ, నవంబరు 15న వరంగల్ విజయగర్జన సభ నిర్వహణ, పార్టీ పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, నగర కమిటీలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. జిల్లా కమిటీలను వేయాలని అధిష్ఠానం భావించినా ముందడుగు పడలేదు. కేసీఆర్ అనుమతిస్తే ఆ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.