చెప్పిన పంటలు వేయకుంటే రైతుబంధు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడటాన్ని అఖిల పక్షం ఖండిస్తుందని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఇది చాలా అన్యాయమని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం మార్కెట్ కల్పించి.. ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. వెంటనే ఈ వైఖరీని మానుకోవాలని డిమాండ్ చేశారు.
"నీళ్ల కోసం జరిగిన ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో కృష్ణా నదిలో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి నీళ్లు కూడా ఇతర రాష్ట్రాలకు అప్పజెప్పటానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత పోతిరెడ్డి పాడు తూం పెంచుతుంటే కూడా ప్రభుత్వం కిిమ్మనకుంది. "