ఎన్నికల్లో కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అని హామీలు ఇచ్చి... విద్యను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో... 'రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ బడుల మూసివేతను అడ్డుకుంటాం' అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వ్యాయామ, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కృష్ణయ్య కోరారు. విద్యను వ్యాపారం చేసేందుకు కేసీఆర్ పునాదులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని... ఆర్టీసీ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ ఆస్తులను అమ్ముకునేందుకు చర్యకు దిగుతున్నారని ఆరోపించారు.
పోరాటాలు చేయాల్సిందే..