కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిలపక్ష పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రజల అవసరాల కోసం కాకుండా.. వాళ్ళ అవసరాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.
'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం' - అఖిలపక్ష పార్టీ నేతలు సమావేశం
కరోనా వ్యాప్తి, తాజా రాజకీయ పరిస్థితులపై అఖిలపక్ష పార్టీ నేతలు సమావేశమయ్యారు. కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం కాకుండా... వాళ్ల అవసరాలకే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'
హిమాయత్‌నగర్‌లో ముక్దూం భవన్‌లో అఖిలపక్ష పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెదేపా అధ్యక్షుడు రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాంలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు.
ఇదీ చూడండి:నీరా పాలసీ వస్తుందంటే నమ్మలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
Last Updated : Jul 23, 2020, 2:13 PM IST