తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ప్రతిపక్షాల లేఖ - Opposition letter to CM KCR

రాష్ట్రంలో హైకోర్టు సూచించిన మేరకు కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని ప్రతిపక్షాలు... సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశాయి. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ప్రతిపక్షాల లేఖ
ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ప్రతిపక్షాల లేఖ

By

Published : Jul 24, 2020, 4:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వామపక్షాలు, తెదేపా, తెజస, తెలంగాణ ఇంటి పార్టీలు బహిరంగ లేఖ రాశాయి. హైకోర్టు సూచించిన మేరకు కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని లేఖలో పేర్కొన్నాయి. కరోనా వల్ల బతుకు దెరువు కోల్పోయిన అసంఘటిత కార్మికులు, చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు ఉచిత రేషన్ తో పాటు నవంబర్ వరకు నెలకు రూ. 7,500 ఇవ్వాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.

ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ప్రతిపక్షాల లేఖ

ABOUT THE AUTHOR

...view details