సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గన్‌పార్క్ వద్ద తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఆందోళనలు చేపట్టారు. నిరసనకు అనుమతి లేదని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి..స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గన్‌పార్క్ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్ - తెలంగాణ తాజా వార్తలు
సచివాలయం కూల్చివేతపై అఖిలపక్ష సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద తెదేపా, సీపీఐ, తెజస, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

గన్‌పార్క్ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్
ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలు చెప్పిన మాటలను సర్కార్ పరిగణలోకి తీసుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకుంటే ప్రతిపక్షాలుగా నిలదీస్తామన్నారు.
గన్‌పార్క్ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు
Last Updated : Jul 13, 2020, 1:57 PM IST