తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎస్ సోమేశ్ కుమార్​తో అఖిలపక్ష నేతల భేటీ.. - All party leaders on corona in telangana

హైదరాబాద్​ బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా సహాయక చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు.

'కరోనా కట్టడికి అందరినీ కలుపుకుపోవాలి'
All party leaders meet with cs

By

Published : Apr 30, 2020, 11:31 AM IST

కరోనా కట్టడికి అందరినీ కలుపుకొనిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని అఖిలపక్ష నేతలు అన్నారు. హైదరాబాద్​ బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో వారు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా సహాయక చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం.. సీఎస్​ను కలిశారు.

కరోనా వ్యాప్తి నివారణలో లాక్‌డౌన్‌ కీలక పాత్ర పోషిస్తుందని అఖిలపక్ష నేతలు తెలిపారు. వ్యాధిని రూపు మాపడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే చాలదన్నారు. వైద్య వ్యవస్థ బలోపేతానికి లాక్‌డౌన్‌ను ఉపయోగించాలని సీఎస్​కు సూచించారు. లాక్‌డౌన్‌ కాలాన్ని కరోనా నిర్ధరణ పరిక్షలకు ఉపయోగించాలన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న సహాయాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వ సహాయాన్ని పేదలందరికీ వర్తింపజేయాలి విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలంటే పారదర్శకంగా వ్యవహరించాలి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: అయినవారు దూరమై.. ఆదరించేవారు కరవై..

ABOUT THE AUTHOR

...view details