రేపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సకల జనుల సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వాలని అఖిలపక్ష పార్టీల నేతలు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిసి కోరారు. అఖిలపక్ష పార్టీల విజ్ఞప్తిని సీపీ అంజనీకుమార్ నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి కోరుతూ నిన్న రాత్రే దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో... సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతలు ఆచార్య కోదండరాం, ఎల్.రమణ. తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం అఖిలపక్ష నేతలంతా సీపీని కలిశారు. సామూహిక దీక్షకు అనుమతి కోరితే ఇవ్వకపోగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని కోదండారం మండిపడ్డారు. రేపు సామూహిక దీక్ష జరిపితీరుతామని... ఇందుకోసం న్యాయపరంగా ప్రయత్నం కొనసాగిస్తామని కోదండరాం తెలిపారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అక్రమ అరెస్టులు అనైతికం... దారుణం!
రేపు ట్యాంక్ బండ్‌పై తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులను అనుమతి కోరితే ఇవ్వకపోగా.. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండారం మండిపడ్డారు. అక్రమంగా అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
all party leaders meet to CP