ఎల్‌ఆర్‌ఎస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దారి దోపిడీ చేస్తోందని అఖిల పక్షం నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 25 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు.
ఇతర కులాలను బీసీ జాబితాలో కలపడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే రిజర్వేషన్లు పెంచకుండా ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఎల్ఆర్‌ఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.