కరోనా కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... బియ్యం, నగదు అందజేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని ప్రేమిలాథాయ్ నగర్ బస్తీలో... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెజాస అధ్యక్షుడు కోదండరాం, ఇతర నాయకులతో కలిసి పర్యటించారు. కరోనా నివారణ చర్యలు, ప్రభుత్వ సహాయంపై... బస్తీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలపై... విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారంటున్న నాయకులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'పనులు లేక ఇబ్బంది పడుతున్న వేళ... అదనపు భారాలా?' - విద్యుత్ బిల్లులపై అదనపు భారాలు
పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలను ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేసారు. లాక్డౌన్ కాలంలో ఇచ్చిన విధంగా బియ్యం, నగదు అందించాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.7500 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
'పనులు లేక ఇబ్బంది పడుతున్న వేళ... అదనపు భారాలా?'