తెలంగాణ

telangana

ETV Bharat / state

తెజస భవన్​లో అఖిలపక్ష నేతల సమావేశం - తెజస భవన్​లో అఖిలపక్ష నేతల సమావేశం

హైదరాబాద్​ నాంపల్లిలోని తెజస కార్యాలయంలో అఖిలపక్షనాయకులు సమావేశమయ్యారు. కరోనా నివారణపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపక్షాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను నేతలు చర్చించనున్నారు.

all parties meeting at tjs bhavan in nampally hyderabad
తెజస భవన్​లో అఖిలపక్ష నేతల సమావేశం

By

Published : May 7, 2020, 4:56 PM IST

హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ నాయకులు సంపత్‌కుమార్, పొన్నం ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, రైతు సమస్యలు, కొవిడ్​పై నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వంటి పలు విషయాలపై అఖిలపక్ష నాయకులు చర్చించనున్నారు.

ఇదీచూడండి:విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details