All Parties Candidates Filing Nomination : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. వారం రోజులుగా అంతంత మాత్రంగా నామినేషన్లు దాఖలు కాగా.. రేపటితో గడువు ముగియనుండటం, ఇవాళ ఏకాదశిని పురస్కరించుకుని రాజకీయ పార్టీల అభ్యర్థులు చాలా వరకు ఇవాళ నామపత్రాలు సమర్పించారు.
గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ - భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
సిరిసిల్ల అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలుచేశారు. సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు వందలాది మందితో కలిసి తలసాని ర్యాలీ నిర్వహించారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
BRS MLA Candidates Nominations :సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి హరీశ్‌రావు నామినేష్ వేశారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో నామినేషన్ వేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నామినేషన్ వేశారు. పట్టణంలోని శాస్త్రినగర్‌లో గల తన నివాసం నుంచి భారీగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరిన ఇంద్రకరణ్.. ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో దుబ్బాక కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో దుబ్బాకకు వచ్చిన ఆయన.. వీల్‌ఛైర్‌పై వెళ్లి నామపత్రాలు అందజేశారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.
Congress Candidates Election Nomination : ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ వేస్తున్నారు. అంతకుముందు వైరాలోని దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి భట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల‌్లా కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి, హుజుర్నగర్ ఆర్వో కార్యాలయంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి నిడమనూరులో నామినేషన్ వేశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఒకే రోజు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నామినేషన్లతో ఓ దశలో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు.