హైదరాబాద్ దోమలగూడలోని గగన్ మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలు కొనసాగడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ఈ ఆరోగ్య కేంద్రంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. కరోనా నిర్ధరణ పరీక్షలు గతేడాది ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నామని చెప్పారు.
'సిబ్బంది కొరత ఉన్నా పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాం' - తెలంగాణ వార్తలు
దోమలగూడలోని గగన్ మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయి సేవలందిస్తున్నామని వైద్యాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గతేడాది నుంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
గగన్ మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రం, దోమలగూడ పట్టణ ఆరోగ్య కేంద్రం
సిబ్బంది కొరత ఉన్నప్పటికీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ సరఫరా చేసే శానిటైజర్, ఫేస్ మాస్క్, గ్లౌజ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో అందడం లేదని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు తమకు అందడం లేదని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగానికి అనుమతి