ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం (rajaka sangham) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు రజక సంఘం నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. రజక భవనాల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని, జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని రజక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రజకులందరం ఏకమై హుజూరాబాద్‌లో తెరాసను ఒడిస్తామని హెచ్చరించారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అఖిల భారత రజక సంఘం - telangana varthalu
ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ(assembly) ముట్టడికి అఖిల భారత రజక సంఘం(rajaka sangham) యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
![అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అఖిల భారత రజక సంఘం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అఖిల భారత రజక సంఘం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13230670-149-13230670-1633089125611.jpg)
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అఖిల భారత రజక సంఘం
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అఖిల భారత రజక సంఘం
దేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు. తెలంగాణలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. చేర్చకపోతే హుజూరాబాద్‌లో రజకులంతా ఏకమై తెరాస ప్రభుత్వాన్ని ఓడగొట్టడం ఖాయం. తప్పకుండా ట్యాంక్‌బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలి. -అనిల్ కుమార్, రజక సంఘం జాతీయాధ్యక్షుడు
ఇదీ చదవండి:KTR speech latest: 'సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు పరిశ్రమలు తీసుకెళ్తే ఓరుస్తలేరు'