తెలంగాణ

telangana

ETV Bharat / state

'వక్ఫ్​బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలి' - మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎమ్ఏ సిద్దిఖీ

వక్ఫ్​బోర్డ్ ఆస్తులను పరిరక్షించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎమ్ఏ సిద్ధిఖీ ఆరోపించారు. ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

wakf board lands
'వక్ఫ్​బోర్డుకు జ్యుడీషియల్ పవర్ ఇవ్వాలి'

By

Published : Mar 20, 2020, 8:34 PM IST

వక్ఫ్​బోర్డ్ ఆస్తులను పరిరక్షించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎమ్ఏ సిద్ధిఖీ ఆరోపించారు. ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వేల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. లీజుల పేరుతో వక్ఫ్ ఆస్తులను కొంత మంది తక్కువ అద్దెలతో వ్యాపారాలు నడుపుతున్నారని ఆరోపించారు. ఓల్డ్ సిటీ, మదీనా సమీపంలో వక్ఫ్​కు చెందిన మూడు వందలకు పైగా షాపులకు అద్దె చెల్లించడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వక్ఫ్​బోర్డుకు 77 వేల ఎకరాల భూములు ఉంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేలో కేవలం 40 వేల ఎకరాల భూములే వచ్చాయని మిగిలిన 37 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని సిద్ధిఖీ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ... వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు​.

'వక్ఫ్​బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలి'

ఇవీ చూడండి:కరోనా నివారణ చర్యలకు కేంద్రం కితాబిచ్చింది: మంత్రి ఈటల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details