బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఆసోసియేషన్, ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం బీమారంగ సంస్థ ఎల్ఐసీ విలువను వాటాలుగా విభజించి ఐపీఓకు లిస్టింగ్ చేయాలన్న ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక రోజు సమ్మెలో భాగంగా హైదరాబాద్ సైఫాబాద్‌లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు
బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన - సైఫాబాద్‌లో ఎల్ఐసీ ఉద్యోగుల నిరసన
కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థను వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్లో ఐపీవోకు తీసుకురావాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ ఆసోసియేషన్, ఎల్ఐసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక రోజు సమ్మెలో భాగంగా హైదరాబాద్ సైఫాబాద్‌లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
![బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన All india insurance employees association dharna on the FDIs are in insurance sector in saifabad in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11058803-979-11058803-1616061653031.jpg)
బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన
పాలసీదారుల ప్రయోజనాలను కాపాడడానికి తాము ఒక రోజు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఎల్ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన నిర్ణయమన్నారు. 24 ఏళ్లుగా మారుమూల ప్రాంతాలకు విస్తరించి దేశ మౌలిక రంగాల అభివృద్ధి కోసం సంస్థ నిధులను సమకూర్చిందని తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు నిలయమైన ఎల్ఐసీని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరారు. బీమారంగంలో తక్షణమే విదేశీ పెట్టుబడులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.