లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆల్ ఇండియా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. వేసవి కాలంలో అదనంగా ఆదాయం వచ్చే ముంజలు కూడా అమ్ముకోలేక మరింత నష్ట పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా 30 వేల నుంచి లక్షా 50 వేల మంది ఈ వృత్తిపై జీవిస్తున్నారని.. వీరితో పాటు అదనంగా మరో 4 నుంచి 5 లక్షల మంది పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: వేములయ్య గౌడ్ - గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టపోయిన గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆల్ ఇండియా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గీత కార్మికుల కష్టాలను ముఖ్యమంత్రికి వివరించాలని విజ్ఞప్తి చేశారు.
గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: వేములయ్య గౌడ్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గీత కార్మికుల కష్టాలను మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి.. వారికి ఆర్థికంగా సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి