తెలంగాణ

telangana

ETV Bharat / state

హేమంత్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా - hemanth hanour killing

హేమంత్​ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అవంతికి న్యాయం చేయాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను ఐద్వా బృందం కలిసి వారికి ధైర్యం చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు తొందరగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

All India Democratic Women's Association demand The accused in the Hemant case should be severely punished
హేమంత్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా

By

Published : Sep 27, 2020, 7:51 PM IST

శేరిలింగంపల్లిలో అవంతిని కులాంతర వివాహం చేసుకున్న హేమంత్​లను నమ్మించి సినీ ఫక్కీలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని.. అవంతికి న్యాయం చేయాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్​ చేశారు.

హేమంత్ హత్య నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులను ఐద్వా బృందం కలిసి వారికి ధైర్యం చెప్పింది. నిందితులకు శిక్ష పడేవరకు అండగా ఉంటామని చెప్పారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హేమంత్ భార్య అవంతిని కలిసి ఆమె ద్వారా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 18 మంది నిందితులు ఉన్నారని, 14 మందిని ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు.

మిగిలిన నలుగురిని, ముఖ్యంగా వాళ్ల అన్నయ్యని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటికే అవంతి, హేమంత్ తల్లి, తమ్ముడు మొదలగు వారికి ఆ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ప్రధాన నిందితులను కఠినంగా శిక్షించే వరకు మాకు ఐద్వా సపోర్టు కావాలని వారు కోరారు.

ఆ కేసులో 18 మంది నిందితులను కఠినంగా శిక్షించి అవంతికి న్యాయం జరిగే వరకూ ఐద్వా అండగా ఉంటుందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు కె.ఎన్.ఆశాలత పేర్కొన్నారు. ఆ బృందంలో ఐద్వా రాష్ట్ర నాయకులు ఆర్​.అరుణజ్యోతి, ఎమ్​.వినోద ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు తొందరగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి :చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details