Educational Institutions in Telangana: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించాలని ఓయూ, జేఎన్‌టీయూహెచ్ మొదట నిర్ణయించినప్పటికీ... ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం వెనక్కి తగ్గాయి. యూనివర్సిటీ, అనుబంధ ప్రైవేట్ కళాశాలలను ఈనెల 12 వరకు తెరవకూడదని ఓయూ... మొదటి, రెండు సంవత్సరాలకు మాత్రం ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని జేఎన్‌టీయూహెచ్ మొదట నిర్ణయించాయి.
అయితే ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా... యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను మూసివేసి బడులను ఎలా తెరుస్తారని ఇటీవల హైకోర్టు కూడా ప్రశ్నించింది. దీంతో ఆన్‌లైన్ బోధన కొనసాగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఓయూ, జేఎన్‌టీయూహెచ్... రేపు అన్ని కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కూడా రేపు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా ఈనెల 8 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు.