తెలంగాణ

telangana

ETV Bharat / state

ECET: నేడే ఈసెట్.. ఒక్క నిమిషం నిబంధన వర్తింపు

పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్(ECET) ఇవాళ జరగనుంది. నేడు రెండు విడతల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ECET
నేడే ఈసెట్

By

Published : Aug 3, 2021, 5:19 AM IST

Updated : Aug 3, 2021, 6:30 AM IST

ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించునున్న ఈసెట్ (ECET) పరీక్ష ఇవాళ జరగనుంది. లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులకు ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

రెండు విడతల్లో పరీక్ష

రెండు విడతల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎస్ఈ, ఈసీఈ, ఈఐఈ, ఈఈ​ఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుందని కన్వీనర్ సిహెచ్. వెంకటరమణారెడ్డి తెలిపారు. సివిల్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, కెమికల్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం 24 వేల 808 మంది అభ్యర్థుల కోసం రాష్ట్రంలో 37.. ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

BTECH CLASSES: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అడ్వాన్స్‌డ్‌ కష్టాలు!

entrance exams: ఆగస్టు 3న ఈసెట్‌, 4 నుంచి ఎంసెట్‌

Last Updated : Aug 3, 2021, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details