తెలంగాణ

telangana

ETV Bharat / state

Gurukul entrance exam: 'గురుకుల ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం'

బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు.

Gurukul entrance exam
బీసీ గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష

By

Published : Jul 24, 2021, 4:50 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు.

వెబ్​సైట్​లో హాల్​ టికెట్లు..

ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీలో 12 వేల 700 సీట్లను భర్తీ చేయనున్నట్లు మల్లయ్య తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం కోసం 41 వేల 447 మంది.. డిగ్రీలో ప్రవేశం కోసం 5 వేల 367 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే హాల్ టికెట్లు వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులకు హాల్​ టికెట్​ డౌన్​లోడ్​లో ఏమైనా సమస్యలు ఉంటే 040 -23328266 కి ఫోన్ చేయాలని సూచించారు.

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల జూనియర్‌, డిగ్రీ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయి. ఇక్కడ సీటు సాధిస్తే చాలు మంచి మార్కులు సాధించవచ్చనే భరోసా చాలా మంది విద్యార్థుల్లో నెలకొంది.

ఇదీ చూడండి:

మన గురుకులాలు దేశానికే ఆదర్శం: కొప్పుల

గురుకులాల్లో 'పది' గ్రేడ్ల అప్​లోడ్ గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details